నెల్లూరు: గణేష్ ఉత్సవాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్! గణేష్ ఉత్సవాల్లో కొత్త ట్రెండ్ నెలకొంది. ఇప్పటివరకు పురుషులే విగ్రహాలు తీసుకువచ్చే సంప్రదాయం ఉండగా, ఈసారి మహిళలు కూడా ముందుకు వచ్చారు. నెల్లూరు మహిళలు వాహనాల్లో విడవలూరుకు వెళ్లి ట్రక్కుల్లో వినాయక విగ్రహాలు తీసుకొచ్చారు. గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ, ఉత్సాహంతో విగ్రహాలను పట్టణానికి తీసుకువచ్చారు.