ప్రకాశం జిల్లా రాచర్ల బీసీ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో కానుక ప్రజలు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. 9 నెలలుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు చెబుతుంటే పట్టించుకోవటం లేదని బీసీ కాలనీ ప్రజలు అసహనం ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క వీధిలోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిమితికి మించి అక్కడ ప్రజలు నీటి కోసం వస్తుండడంతో కాలయాపన జరుగుతున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.