మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం-2లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి 26 కేజీల బ్యాళ్లు, 7 లీటర్ల మంచి నూనె ప్యాకెట్లను దొంగలించారు. అలాగే, కేంద్రంలోని కోడిగుడ్లను కూడా పగలగొట్టినట్లు తెలిసింది. సోమవారం ఈ సంఘటన వెలుగులోకి రాగా, అంగన్వాడి టీచర్ నాగేంద్రమ్మ, ఐసిడిఎస్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ రాజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలో గత కొంతకాలంగా దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రి వేళల్లో ఇళ్లు, ఆలయాలు, మోటార్ సైకిళ్లతో పాటు ఇప్పుడు అంగన్వాడి కేంద్రాలు కూడా దొంగల లక్ష్యంగా మారాయి.