ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు రామారావు పేర్కొన్నారు. శనివారం కడియం మండలం వేమగిరి జంక్షన్ వద్ద చేపట్టిన ఆటో కార్మికుల నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తే ఆటో కార్మికుల ఉపాధి పూర్తిగా దెబ్బతింటుందన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.