యూరియా కోసం వచ్చిన రైతులకు రైతు వేదిక వద్దకు వెళ్లి టోకెన్ తీసుకోవాలని, అప్పుడే యూరియా ఇస్తామని స్పష్టం చేశారు. గంటల కొద్దీ లైన్ లో నిలుచున్న రైతులు, మళ్ళీ రైతు వేదిక వద్ద లైన్ లో నిల బడాలా అంటూ జాతీయ రహదారి పై చేరి ఆందోళన చేబట్టారు. ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు సంఘీభావం తెలిపారు. రైతుల ఆందోళనతో రహదారి పై వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ బీమరి సృజన రైతులను సముదాయించి ఆందోళన విరమింప చేసారు. అనంతరం రైతు వేదిక లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ విస్తరణ అధికారులు విజృంభణ, దివ్యలు టోకెన్ లు ఇచ్చారు.