కరీంనగర్ లో AIYF ఆధ్వర్యంలో కార్పోరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా..AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ..కార్పొరేటు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు రోగుల యెడల వింత పోకడలు,లైంగిక వేదింపులు, ఆత్యాచారాలను నిరసిస్తూ శనివారం సాయంత్రం 5గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద కార్పోరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల దిష్టీబోమ్మను దగ్దం చేయడం జరిగింది. జిల్లాలోని కార్పోరేట్ ప్రైవేటు ఆసుపత్రులు సరైన విద్యార్హతలు లేని వారిని రిక్రూట్మెంట్ చేసుకుని అర్థరాత్రి వేల యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి ఒడికట్టడం భాధకారమన్నారు.