Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 8, 2025
వరికుంటపాడు మండలం, తిమ్మారెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడింది. విద్యుత్ స్తంభాలు తీసుకెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.