మంత్రాలయం:కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ -6 పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభించడంతో వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని సోమవారం మంత్రాలయం నియోజవర్గం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రా రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబుపై విమర్శలకు ఏమీలేక, ఉల్లి రైతుల పేరుతో డ్రామాలు ఆడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వైసిపి నేతలకు హితవు పలికారు.