పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని పలు గ్రామాలలో వర్షాకాలం కారణంగా విష జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి దీంతో పెద్ద సంఖ్యలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రోగులు అమరావతిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో నిండిపోయింది ఓపిల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని వైద్యులు తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు రవికుమార్ హరిబాబు సూచించారు.