ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఆరు నుండి 17 సంవత్సరాల దివ్యాంగుల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల కోసం స్క్రీనింగ్ సెంటర్లను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఈ భిన్న ప్రతిభావంతులకు భవిత సెంటర్లను ఏర్పాటు చేసి స్పీచ్ థెరపీ ప్రత్యేక బోధనా పద్ధతులు ద్వారా బోధించడం జరుగుతుందన్నారు. వీరికి భవిత కేంద్రాల వద్ద పిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.