రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ గ్రామానికి చెందిన వల్లూరి సంతోష్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి రెబ్బెన పోలిసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగా సంతోష్ ఆత్మహత్య చేసుకోవచ్చని స్థానిక గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.