కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 27 మందికి రూ.18,28,321 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పంపిణీ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలు నేపథ్యంలో వైద్యం కోసం ఆర్థిక సాయం చేయాలంటూ సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా 27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు శ్రీకాంత్, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ తెలిపారు.