ప్రకాశం జిల్లా రాచర్ల ఫారం సమీపంలో తిరుగుతున్న పెద్దపులిని బంధించి అడవిలో విడిచి పెట్టాలని స్థానిక ప్రజలు అటవీశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన స్థానిక ప్రజలు పెద్దపల్లి సంచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గ్రామ సమీపంలోని పొలాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికి అటవీ శాఖ అధికారులు చెప్పినట్లుగా స్థానికులు చెబుతున్నారు. తమకు చాలా భయంగా ఉందని అధికారులు వెంటనే పులిని బంధించి అడవిలో విడిచి పెట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.