మొవ్వలోని రొయ్యల ఫ్యాక్టరీ సమీపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మోటార్ సైకిల్పై వెళ్తున్న వినోద్ అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు అతడిని హుటాహుటిన మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడిన వ్యక్తి ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామానికి చెందిన వినోద్ గుర్తించారు.