ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విద్యానగర్ మరియు శివాలయం వద్ద వినాయక స్వామి విగ్రహాలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. 11 రోజులపాటు స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై స్వామివారిని మేళతాళాలతో డిజె శబ్దాలతో జై జై గణేశా అంటూ గణనాధుని నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం కోసం సమీపంలో ఉన్న ధూపాడు కంభం శ్రీశైలం ప్రాంతాలకు వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.