గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు నగరంలో నేడు (గురువారం) జరగనున్న గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో బందోబస్తు కోసం మోహరింపబడిన పోలీసు సిబ్బందితో సమావేశమై ఆయన దిశానిర్దేశం చేశారు.ఎస్పీ మాట్లాడుతూ– నగరంలో 1,200 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుందని,ఇందుకోసం 2 వేలమంది పోలీసులను మోహరించామని వెల్లడించారు.భద్రతా ఏర్పాట్లు..10 డ్రోన్ కెమెరాలు, 2 వేల సీసీ కెమెరాలతో నిఘా రూఫ్‌టాప్ పికెట్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ఎపీఎస్పీ, స్పెషల్