Parvathipuram, Parvathipuram Manyam | Aug 31, 2025
అరకు, పాచిపెంట మండలాల సరిహద్దు పంచాయతీలలో హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం జరపొద్దంటూ, పవర్ ప్లాంట్ యాజమాన్యం ఆయా భూముల్లో ఏర్పాటు చేసిన దిమ్మలను గిరిజనులు ధ్వంసం చేశారు. ఆదివారం సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలోని శతాబి పంచాయతీలో సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు తదితరులతో కలిసి పంచాయతీ సర్పంచ్ శిల్పజన్ని రామయ్య ఆధ్వర్యంలో దిమ్మలను కూలగొట్టారు. ఈ సందర్భంగా గంగునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను మోసం చేసి నవయుగ కంపెనీకి 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 60 గ్రామాల పరిధిలో భూములివ్వడం దారుణమన్నారు.