వీధి కుక్కల దాడిలో 16 మంది గాయాలైన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి వీధి కుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలో సుమారుగా 16 మందిపై ఒక్కసారిగా దాడి చేసింది. రోడ్డుపై వెళ్తున్న ఒక్కొక్కరిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు 108 వాహనంలో తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు, అందులో తీవ్రంగా గాయపడిన నలుగురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, ఒక బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆ బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశారు.