భీమిలి మండలంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ మైలవరపు. కృష్ణ తేజ అకస్మిత పర్యటన శుక్రవారం ఉదయం నిర్వహించారు. స్వర్ణ పంచాయితీ స్వామిత్వ కార్యక్రమంలో భాగంగా భీమిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించడమే కాకుండా నూతనంగా నిర్మిస్తున్న డిఎల్డిఓ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే తాళ్లవలస పం చాయితీలో సచివాలయానికి వెళ్లి ఆస్తి పన్ను, డిజిటలైజేన్ విధానం అడిగి తెలుసుకున్నారు.