జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెల్లో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించి,10 లక్షల తో నిర్మించనున్న వంటగది నిర్మాణానికి శుక్రవారం ఉదయం 10-30 గంటల ప్రాంతంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం మోడల్ స్కూల్లో వసతులు,విద్య బోధన,బోజన వసతి గురించి తెలుసుకొని, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, నాణ్యమైన విద్యాబోధనకు కృషి చేస్తున్నారు