తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ లేఖ రాశారు తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి రాసిన లేక కు జిల్లా ఎస్పీ జగదీష్ రిప్లై ఇచ్చారు వరుస బందోబస్తు ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు హిందూపురం కదిరి పట్టణాలలో గణేశుడి నిమజ్జన వేడుకలు ఉండడంతో బందోబస్తుకు పోలీస్ సిబ్బందిని పంపినట్లు చెప్పారు అలాగే ఈనెల 5వ తేదీన మిలాద్ ఉన్ నబి కార్యక్రమం ఉండడంతో బందోబస్తు భద్రత ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పారు. ఈనెల ఐదు తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేర బందోబస్తు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.