ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని సంత మార్కెట్ లో మాంస విక్రయాలు నిషేధించాలని కోరుతూ బీజేపీ నేతలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సంత మార్కెట్లోని మాంస విక్రయాలను తొలగించి, వాటిని ఊరి బయట నిర్వహించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పట్టణం నడిబొడ్డున మాంస విక్రయాలు కొనసాగిస్తే నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు