అదిరింపులు, బెదిరింపులతో రైతు సంఘాల నాయకులెవరూ భయపడరని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజానేతలకు క్షమాపణ చెప్పాలని రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ను హెచ్చరించారు. బలవంతపు భూ సేకరణను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం నిరంకుశంగా కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పగించేందుకు సాగిస్తున్న ప్రయత్నాలను ఆపాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు