మండల కేంద్ర శివారు మహారాజుల కాలనీకి చెందిన సిఐఎస్ఎఫ్ జవాను ఆరేపల్లి రమేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. మృతి చెందిన జవాన్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన చిట్యాలలో ఘనంగా జరిగాయి. సిఐఎస్ఎఫ్ జవానులు ప్రభుత్వ, పై అధికారుల ఆదేశాల మేరకు గ్రామానికి చేరుకుని రమేష్ భౌతిక కాయానికి జాతీయ జెండా కప్పి , పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్థించారు. మృతుడి కుమారుడు నిప్పు పట్టగానే అంతిమయాత్ర సాగింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై రమేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.