Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ కారే ఎమ్మెల్యే గండ్ర తో కలిసి సందర్శించారు.ఈనేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ రాహుల్ శర్మ. నిన్నటి రోజున విద్యార్థులు తాగునీరు కలుషితమై అస్వస్థకు గురైన సంఘటనపై విచారణ చేపట్టారు, ఉపాధ్యాయుడు నీటిలో మందు కలిపాడని విద్యార్థులు కలెక్టర్ కు తెలపడంతో వెంటనే సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు కలెక్టర్ రాహుల్ శర్మ.