నర్సాపూర్ (జి) మండలంలో వరద ముంపుకు గురైన పంటలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నర్సాపూర్ (జి) గ్రామంలో దేవుని చెరువుకు గండిపడి పంటలు తీవ్రంగా నష్టపోయాయని రైతులకు పరిహారం అందేలా కృషి చేస్తానని ఎవరు అధైర్య పడవద్దని అన్నారు. ఇందులో బీజేపీ మండల అధ్యక్షులు బర్కుంట నరేందర్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులున్నారు.