Parvathipuram, Parvathipuram Manyam | Aug 27, 2025
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని 23వ వార్డు పరిధిలో ఉన్న రామాకాలనీలో నూతనంగా నిర్మించిన వినాయక మండపాన్ని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర లాంచనంగా ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైసీపీ నాయకులు గిరి రఘు, మేకల శంకర్రావు, రమణ తదితరులతో కలిసి అక్కడికి చేరుకుని వినాయక మండపాన్ని ప్రారంభించారు. అనంతరం వినాయక పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజన్నదొరను ఘనంగా సత్కరించారు.