జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లో పురోగతి చూపడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, డ్వామా అధికారులను ఆదేశించారు. బుధవారం ముండ్లమూరు మండలం, సింగన్నపాలెం గ్రామ పంచాయితీలో ఉపాధిహామీ పధకం కింద చేపట్టిన ఇంకుడు గుంతలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి సంబంధిత లబ్దిదారులు కందిమళ్ళ రాంబాబు తో మాట్లాడి వివారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆరా తీయగా, జీతాలు ఇవ్వడం లేదని తెలుసుకున్న కలెక్టర్ వారికి వెంటనే జీతాలు ఇవ్వాల