తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శనివారం చిట్టమూరు మండలం మల్లాంలోని సుప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రమోత్సవాలు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కిలివేటికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటోను బహూకరించారు. ఈ కార్యక్రమంలో కిలివేటి సంజీవయ్య వెంట వైఎస్ఆర్సీపీ నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవ రెడ్డ