తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ నల్ల బ్యాడ్జీలతో గురువారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంతోపాటు సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో హైస్కూల్, ప్రాథమిక మరియు మున్సిపల్ పాఠశాలల తోపాటు వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసనలు తెలిపారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో సాలూరు పట్టణంలోని డబ్బివీధి మున్సిపల్ హైస్కూల్ వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. తమ బకాయిలు చెల్లించడంతో పాటు యాప్ ల భారాన్ని తగ్గించడం తదితర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు.