కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ఏర్పాట్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క పరిశీలించారు. సభా ప్రాంగణానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని జిల్లా పోలీస్ అధికారులకు తెలిపారు.