మండల కేంద్రంలోని దిగువ పేట బజారు వీధి జంగాలపల్లి ఎస్సీ కాలనీలో వినాయక స్వామి విగ్రహాల నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాల ఊరేగింపులో కోలాటాలు భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. దిగువపేట బజారు వీధిలో వినాయకుని విగ్రహం వద్ద లడ్డూ వేలంలో 70 వేలకు జీ. సుబ్రహ్మణ్యం దక్కించుకోవడం విశేషం.