ఆదివాసీల ఆత్మబంధువు మాజీ మంత్రి కోట్నాక భీంరావు అని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని చిల్డ్రన్ పార్క్ లో కోట్నాక భీంరావు 23వ వర్ధంతిని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ,ఆదివాసీ నాయకులతో కలసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనుల అభివృద్ధితోపాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు.