మక్తల్- నారాయణపేట- కొడంగల్ జీవో 69 ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతన్నలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 20 లక్షల రూపాయలు ఎకరానికి పరిహారం అందజేస్తున్నట్లు ప్రకటించడం పట్ల మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు కుమార్ రెడ్డి శనివారం హైదరాబాద్ లో సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు.