ఘట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు నాలుగవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘట్కేసర్ ఉమ్మడి మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆగదని, ఈ విషయంపై సీఎంకు లేఖ రాస్తానన్నారు.