నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో 12 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐదు గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐ, ఎస్సై లకు చట్ట ప్రకారంగా పరిష్కరించవలసిందిగా సూచించారు. భూ తగాదాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా పోలీసు రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఫిర్యాదులను పరిష్కరించుకోవాలని, లేదా సామరస్యంగా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని, ఎలాంటి ఆవేశాలకు లోను కారాదని ఫిర్యాదు దారులకు ఎస్పీ సూచించారు.