శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జాతీయ రహదారిపై ఎడతెరిపి లేకుండా వాన వస్తుండడంతో వాహనదారులు సైతం ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ వర్షం నీటితో జలమయ్యం అయ్యాయి. కొన్ని చోట్ల వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రెండు రోజుల పాటు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు