ఏలూరులోని వట్లూరు సర్వీస్ రోడ్డులో మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో బైక్ దగ్ధమైంది. వర్షంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు. వెంటనే బైక్ నుంచి మంటలు చెలరేగి వాహనం క్షణాల్లో దగ్ధం అయిందని స్థానికులు తెలిపారు. వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. త్రీ టౌన్ పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.