కణేకల్లు లో ఆర్టీసి బస్సులో నగల బ్యాగ్ దొంగలించిన నలుగురు దోపిడీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 23 లక్షల విలువైన 242.5 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. గురువారం మద్యాహ్నం జిల్లా కేంద్రంలో నిర్వహించ విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్ కేసు వివరాలను వెల్లడించారు. కుప్పం ప్రాంతానికి చెందిన ఆర్. సుమతి, ఎస్. గీత, ఎస్. రంజిత, ఎస్. బృంద అనే నలుగురు ముఠా సభ్యులు ఈనెల 23 న కళ్యాణదుర్గం బస్టాండ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న కణేకల్లు కు చెందిన మహిళను అనుసరించి, ఆమెతో పాటు బస్సు ఎక్కి దిగే సమయంలో దోచేశారు.