దేవనకొండలో కస్తూర్బా కళాశాల భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయగా, ప్రిన్సిపల్ సునీత పర్యవేక్షణలో కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కంప్యూటర్ గది, ఆర్ట్స్ రూమ్, అదనపు తరగతి గది అందుబాటులోకి వచ్చినట్లు ప్రిన్సిపల్ సునీత తెలిపారు.