కణేకల్లు మండలంలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన వడ్డేరాము అనే వ్యక్తి రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గవగుండ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిన ఘటనలో రాము తీవ్రంగా గాయపడగా కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. మెదట గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించి చికిత్స అందించారు. ఆ తర్వాత అతను పరిస్థితి విషమించి మృతి చెందాడు. అతని వివరాలు ఆరా తీయగా ఎర్రగుంట గ్రామానికి చెందిన రాము గా శనివారం ఉదయానికి తెలిసింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు.