జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లాలో పిసిపిఎన్‌డిటి చట్టం అమలుపై తమ ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం 4pm సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నెల వారీగా జరుగుతున్న స్కానింగ్, ప్రసవాలు, అనధికారికంగా ఆసుపత్రుల్లో జరుగుతున్న గర్భశ్రావాల గురించి ప్రశ్నించారు. గర్భస్థ లింగ నిర్ధారణ చేయడం నేరమని, ఇలా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల రెన్యువల్, కొత్త వాటికి అనుమతులపై చర్చించారు. జిల్