దేవనకొండలోని ప్రాథమిక పాఠశాలలో క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధ్యాన్చంద్, గిడుగు వెంకటరామమూర్తి చిత్రపటాలకు ప్రధానోపాధ్యా యుడు నాజిర్ అహ్మద్ ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ధ్యాన్చంద్, గిడుగు వెంకట రామ్మూర్తి లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.