రైతులకు నష్టం జరక్కుండా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉల్లి విక్రయాలు సక్రమంగా జరిగేలా మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తో కలిసి జిల్లా కలెక్టర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పర్యటించారు..ఉల్లి విక్రయాలపై రైతులతో మాట్లాడి, అనంతరం మార్కెట్ కమిటీ, మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులు, ట్రేడర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.