సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాలను నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గచ్చు మత్తడి కాలువకు రిపేర్ చేయకపోవడంతో నీరు గ్రామంలోకి వస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి గచ్చు మత్తడికి రిపేర్లు చేయాలని డిమాండ్ చేశారు.