గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్లలో వ్యర్ధాలు తొలగింపుపై ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, నగర ప్రజలు వర్షాల వలన ఏమైనా సమస్య ఎదుర్కొంటే కాల్ చేయడానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 08632345103 సిద్దం చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గురువారం సాయంత్రం నల్లపాడు రోడ్ అవుట్ ఫాల్ డ్రైన్, శ్రీరామ్ నగర్ రోడ్ ఆక్రమణల తొలగింపు, ఎస్వీఎన్ కాలనీ, విద్యా నగర్ ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.