విశ్వ బంధుత్వ దినోత్సవం రాజా యోగిని దాది ప్రకాశ మని 18 పుణ్య స్మృతి దినం సందర్భంగా దేశవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరంలో భాగంగా ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వారి సౌజన్యంతో సోమవారం 11 గంటల సమయంలో రక్తదాన శిబిరాన్ని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీ ఆదిత్య గౌడ్, ఆత్మ రామ్ ఏడీకే లైన్స్ క్లబ్ సభ్యులు, భీష్మరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.