యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా కాకితాల లోడుతో వెళ్తున్న బొలోరో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి .అందరు చూస్తుండగానే వాహనం పూర్తిగా దగ్ధమైంది .ఈ ఘటనతో అటుగా వెళుతున్న వాహనాధారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు .ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.