రాజ్యాంగానికి నాలుగు స్తంభాలు ఉన్నట్లు రాష్ట్ర భవిష్యత్తుకు నాలుగు స్తంభాలాంటివారు ఉన్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తుకు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఉన్నారన్నారు. వీరి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదన్నారు. కూటమి ప్రభుత్వం 21 లక్షలు పెట్టుబడులు తీసుకు రావడంతో పాటు 11 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదన్నారు.