శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మధ్యాహ్నం జరిగిన సలహా మండలి కమిటీ సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలు తప్పనిసరిగా అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రసవాల సంఖ్య పెంచాలని స్థానిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నారని ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు..